హైదరాబాద్: మద్యం మత్తులో రాహుల్ అనే యువకుడు జియాగూడలో రోడ్లపై వెళ్లే వాహనాలను అడ్డుకుని హంగామా చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు పోలీసులను దుర్భాషలాడుతూ హంగామా సృష్టించాడు. అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నించాడు. ఈ ఘటనతో ఆసుపత్రిలోని రోగులతో పాటు వైద్యసిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు తాగుబోతుకు వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వడంతో మత్తు దిగాక అతన్ని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు..