Telugu Updates
Logo
Natyam ad

హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా భావించాలి: ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్

రామగుండం పోలీస్ కమిషనరేట్: గోదావరిఖని, ఏన్టీపీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది రామగుండం మున్సిపల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు జెండా ఊపి హెల్మెట్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మున్సిపల్ జంక్షన్ నుండి గాంధీ చౌక్, ఎఫ్సీఐ క్రాస్ రోడ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ప్రతి మోటార్ సైకిల్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల చాలామంది తరచుగా మరణించడం. జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంబడి ఉంచుకోవాలని, త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్ఐ లు కమలాకర్, నాగరాజు, మంచిర్యాల ట్రాఫిక్ ఎస్ఐ లు శివ కేశవులు, విజయ్, మరియు పెద్దపల్లి, మంచిర్యాల రామగుండం ట్రాఫిక్ పోలీసులు పాల్గోన్నారు.