సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి: ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో చాలా రోజులుగా సివిల్ కానిస్టేబులు కోర్టు కేసుల కారణంగా పదోన్నతులు పొందడం వీలు కాలేదు. గత నెలలో కోర్టు దీనికి పరిష్కారం చూపుతూ పదోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత సీనియారిటీ కలిగిన నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ, మరియు జోన్ లకు పోస్టింగ్లు కల్పిస్తూ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వారికి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించడం. జరిగింది…
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతుల ద్వార బాధ్యతలు మరింత పెరుగుతాయని తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు తమదైన గుర్తింపు లభిస్తుందని, సంతోషంగా నూతన పోస్టింగులలో విధులు నిర్వర్తించాలని సూచించారు. క్రమశిక్షణతో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందని తెలిపారు. ఖాళీల ఆధారంగా త్వరలో మరిన్ని ప్రమోషన్లు ఇవ్వబడతాయి అని సూచించారు. ఈ సమావేశంలో సూపరిండెంట్ జోసెఫిన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, సిసి దుర్గం శ్రీనివాస్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి జి సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.