Telugu Updates
Logo
Natyam ad

పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: సీపీ. చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్ సిబ్బంది కి ఆరోగ్య కార్డుల పంపిణీ:

మంచిర్యాల జిల్లా: పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు దిగుతారని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ అన్నారు. మెడి లైఫ్ మంచిర్యాల ఆస్పత్రి యాజమాన్యం పోలీసు సిబ్బందికి ఉచితంగా హెల్త్ కార్డులను అందజేసింది. మంచిర్యాల లోని మెడిలైఫ్  హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి రామగుండం పోలీసు కమిషనర్ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రామగుండం పోలీసు కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులకు ఉచితంగా ఆరోగ్య కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ…. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కరీంనగర్, హైదరాబాద్ లలో ఆరోగ్య భద్రత ఉన్న హాస్పిటల్ కి వెళ్లలేము. అందువల్ల లోకల్ హాస్పిటల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ సిబ్బంది చికిత్స సమయంలో ఫీజు రాయితీ  ఇచ్చిన మెడిలైఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నూతన్ అరవింద్ గారికి, హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లకి  సీపీ గారు కృతజ్ఞతలు అభినందనలు తెలపడం  జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలి. ఆరోగ్యం గా ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతంగా పని చేయగలము అని అన్నారు..
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్, మంచిర్యాల ఏసీపీ ఎస్ రష్మీ పెరుమాళ్ ఐపిఎస్, బెల్లంపల్లి ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, మహిళ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐ అనిల్, డాక్టర్స్ కుమార్ స్వామి, చైతన్ చౌహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.