మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, పుర అధ్యక్షుల ఆగడాలు వేదింపులు భరించలేక అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరని మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి ఆరోపించారు. కనీసం ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చెయ్యకుండా పోలీస్ అధికార పార్టీ నాయకులకు అండగా నిలిచి సామాన్యుల పాలిట శాపంగా పోలీస్ వ్యవస్థ ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆగడాలపై విచారణ జరిపించి పార్టీలకతీతంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు..