ఎమ్మెల్సీ కవిత బర్త్ డే.. అరేబియా సముద్రంలో వినూత్నంగా విషెష్..
తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా కలిసి.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా విషెష్ చెబుతున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన తెరాస నేత చిన్ను గౌడ్ వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. అరేబియా సముద్రంలో పది పడవలపై కల్వకుంట్ల కవిత ఫొటోలను ప్రదర్శించారు. కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.