Telugu Updates
Logo
Natyam ad

లాడ్జీలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య..!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని విష్ణు లాడ్జీలో చాట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పదేళ్ల క్రితం మంచిర్యాలలో రోజువారీ కూలీ పనులు చేసుకునే మృతుడు ప్రస్తుతం హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలోని బంధువుల ఇంటికి వచ్చిన మృతుడు సోమవారం రాత్రి లాడ్జీలో బలవన్మరణానికి పాల్పడగా మంగళవారం గుర్తించారు. అప్పులు పెరిగి చెల్లించే పరిస్థితి లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారం తెలిపారు..