శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయం ఆవరణలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు (50) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఏఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు ఈ ఉదయం విధులకు హాజరై రోక్కాల్ అనంతరం సమీపంలోని శిథిలావస్థలో ఉన్న భవనంలోకి వెళ్లాడు. అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసైన సుబ్బారావు ఈ విషయమై నిత్యం కుటుంబ సభ్యులతో ఈ క్రమంలో నిన్న (ఆదివారం) గ్రామంలో మరిడమ్మ సంబరం జరిగింది. సుబ్బారావు అతిగా మద్యం తాగడంతో అతనికి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బారావు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు రాజారావు ప్రస్తుతం ఏఆర్ కార్యాలయంలో ఎస్ఓఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతని అల్లుడు బాబు నాయుడు కూడా ఏఆర్ కార్యాలయంలో ఆర్ఎస్సైగా పని చేస్తున్నారు..