యూపీలో ఘటన.. హత్యాచారంగా అనుమానాలు.
ఉత్తరప్రదేశ్: నర్సుగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఓ యువతి ఆస్పత్రి గోడకు శవంగా వేలాడిన ఘటన ఉత్తరప్రదేశ్ లొనీ ఉన్నావ్ లో చోటు చేసుకొంది. ఉన్నావ్లోని న్యూజీవన్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆస్పత్రిని ఐదు రోజుల క్రితమే ప్రారంభించడం గమనార్హం. శుక్రవారం ఓ యువతి నర్సుగా ఉద్యోగంలో చేరింది. శనివారం ఉదయం ఆస్పత్రి గోడకు ఉన్న పిల్లర్ ఊచలకు వేలాడుతూ కనిపించింది. ఆమె మెడకు తాడుతో ఉచ్చు బిగించి ఉంది. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అనుమానితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.