ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో, నివాసాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆధ్మాత్మిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్డి కాలనీ రాంనగర్, తదితర కాలనీల్లో మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్మాత్మిక సంస్థ మహిళలు నాగమణి, మౌనిక మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టు వస్త్రాలను అలంకరించి కుంకుమార్చన చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం పోయడంతోపాటు మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే, పలు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. సిరుల తల్లి వరలక్ష్మి దేవిని పూజిస్తే అ ఇంట్లో సకలసంపదలు. ఆయురారోగ్యాలు కలుగుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో భార్గవి, రాణి, సాత్విక, సమత, రజిత, అనూష, సుధ, జ్యోతి, శ్రావణి, స్వాతి, అరుణ, దివ్య తదితరులు పాల్గొన్నారు.