Telugu Updates
Logo
Natyam ad

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.!

నిజమాబాద్ జిల్లా: తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని, డాక్టర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమె గైనకాలజీ విభాగంలో నిర్జీవంగా కనిపించింది. ఆమె గుండెపోటుతో మృతి చెందిందా లేక మరేదైనా కారణాలున్నాయని అని పోలీసులు ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రి గైనిక్ వార్డులో నైట్ డ్యూటీలో ఆమె ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

మృతి చెందిన డాక్టర్ శ్వేత స్వస్థలం కరీంనగర్ జిల్లాగా తెలుస్తోంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న ఆమె ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనింగ్ లో ఉన్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.