Telugu Updates
Logo
Natyam ad

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్లోర్ లీడర్ అంకం నరేష్ మాట్లాడుతూ సర్వే నంబర్ 140లోని ప్రభుత్వ భూమిలో రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని ధ్వంసం చేశారని, కార్మెల్ స్కూల్ వెనక ప్రభుత్వ భూమి ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని తెలిపారు.