Telugu Updates
Logo
Natyam ad

తెలంగాణలోని ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.?

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 90 వేల ఉద్యోగాల భర్తీకి వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే గ్రూప్ -1 తో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఆరు యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ గా బుధవారం ప్రారంభించారు. రేపటి నుంచి ఉద్యోగార్థులకు కోచింగ్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. యూనివర్సిటీల్లో ఉండి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఈ కోచింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతాయన్నారు. కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు ఉచితంగా మెటిరీయల్ అందిస్తామని చెప్పారు.