మంచిర్యాల జిల్లా: కాళేశ్వరం జోన్ పరిధిలో 225 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందికి జిల్లాల అలాట్ ఉత్తర్వుల పత్రాలు అందించి, హెడ్ కానిస్టేబుల్ బ్యాడ్జి పెట్టారు. అనంతరం మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేయాలని సూచించారు. పదోన్నతితో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని, గర్వంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు కోర్టు సానుకూలంగా స్పందించడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ లభిస్తున్నాయని, ఈ భారీ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, తదితరులు పాల్గొన్నారు.