Telugu Updates
Logo
Natyam ad

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం..?

మంచిర్యాల జిల్లా: ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్ లోని పిహెచ్సీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం వైద్య నిపుణులు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..