Telugu Updates
Logo
Natyam ad

ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్లు ప్రారంభం..!

ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల జిల్లా: కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్లను ఆదివారం ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..