నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ..!
రామగుండం పోలీస్ కమిషనరేట్: త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పోలీస్ శాఖ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల యువతి, యువకులు తమకు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పోలీస్ శిక్షణ కేంద్రం, సమయం వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సిపి తెలిపారు.