Telugu Updates
Logo
Natyam ad

పార్లమెంట్ లో పోర్న్ వీడియోలు చూసిన ఎంపీ..?

బ్రిటన్: తాను ఉన్నది చట్టసభల్లో అనే స్పృహను ఆ ప్రజాప్రతినిధి మరిచాడు. దేశ అత్యున్నత చట్టసభలో ఆత్రం ఆపుకోలేకపోయాడు. ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చివరికి అవమానకర రీతిలో సస్పెండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బ్రిటన్లోని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నీల్ పరీశ్(65) హౌస్ ఆఫ్ కామన్స్ సభలో సభ్యుడు. గతంలో చట్టసభలో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. సహచర సభ్యులు పరిశీలించగా పోర్న్ చూస్తున్నాడని తేలింది. దీనిపై ప్రతిపక్ష నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయనపై చర్యలకు ప్రధాని బోరిస్ జాన్సన్ వెనుకాడారు..

త్వరలో బ్రిటన్ దేశంలో మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు ముందు పోర్న్ వీడియోల వ్యవహారం తమకు ఇబ్బంది మారుతుందని ప్రభుత్వం భావించింది. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీ నీల్ పరేశ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తాను ట్రాక్టర్లను చూసేందుకు వెబ్ సైట్ ఓపెన్ చేశానని, అనుకోకుండా పోర్న్ వీడియోలు వచ్చేశాయని నీల్ పరేశ్ వాపోయాడు.