Telugu Updates
Logo
Natyam ad

మాజీ నక్సలైట్ కుటుంబాన్ని ఆదుకున్న పోలీసులు..!

కొమరం భీమ్ జిల్లా: తిర్యాని మండలం లోని రొంపల్లి మొఖసి గూడా కు చెందిన చార్లెస్ అలియాస్ శోభన్ గతంలో చత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా పోలీస్ మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం రెబ్బెన సిఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో తిర్యాని ఎస్ఐ సిహెచ్ రమేష్ చార్లెస్ అలియాస్ శోభన్ అక్కకోవ లక్ష్మి బావ సూర్య రావుల కుటుంబానికి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను అందజేశారు..

ఈ సందర్భంగా రెబ్బెన సీఐ అల్లం నరేందర్ మాట్లాడుతూ.. యువతను గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో చార్లెస్ ఆలయ శోభన్ అక్కకు రోడ్డుప్రమాదంలో కాలును తీసివేయగా ఏమి పని చేసుకోలేని దీన స్థితిలో ఉన్న కుటుంబానికి పోలీస్ మీకోసం కార్యక్రమంలో అండగా ఉండడం జరిగిందని తెలిపారు యువత అసాంఘిక శక్తులకు తావివ్వకుండా మంచిగా చదువుకొని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉద్యోగాల్లో రాణించాలని పేర్కొన్నారు అలాగే గ్రామాల్లో అసాంఘిక శక్తులు సంచరించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరారు..

ఈ కార్యక్రమంలో దిందర్ష, గ్రామ పటేల్లు ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..