Telugu Updates
Logo
Natyam ad

అటవీశాఖ సిబ్బంది ఆత్మహత్యాయత్నం..?

నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని అటవీశాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే. మామడ అటవీశాఖ రేంజ్ పరిధిలోని ఆరెపల్లి రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, బీట్ ఆఫీసర్ వెన్నెల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో రైతు సతీష్ నోట్లో పురుగుల మందు పడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం అటవీశాఖ అధికారులు సస్పెండ్ చేసారు. ఈ విషయమై జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి భర్త కొరిపెల్లి రాంకిషన్ రెడ్డి గురువారం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి చేరుకొని అధికారులతో సస్పెండ్ విషయం చర్చిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సిబ్బంది పురుగుల మందు తాగారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బీట్ ఆఫీసర్ వెన్నెలను క్రిటికల్ కేర్ లో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, రైతు సతీష్ లను ఐసీయూలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.


ఆత్మహత్యాయత్నానికి కారణం ఆరెపల్లి రేంజ్ పరిధిలోని పోడు భూములలో వేసిన బోరు బావులకు డబ్బులు తీసుకున్నారని అభియోగం మోపి సస్పెన్షన్ విధించడమే కారణంగా తెలుస్తోంది. జిల్లా కేంద్రాస్పత్రికి అటవీశాఖాధికారులు చేరుకుని వారితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా న్యాయమూర్తి ఆస్పత్రికి చేరుకుని బాధితుల వాంగ్మూలాన్ని సేకరించారు.