Telugu Updates
Logo
Natyam ad

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల

మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి అజయ్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు చిన్నపాటి నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన వెంటనే 101కు కాల్ చేస్తే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ అధికారి దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు..