Telugu Updates
Logo
Natyam ad

మంత్రి హోదాలో తొలిసారి నెల్లూరుకు కాకాణి..!

కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన శ్రేణులు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి హోదాలో తొలిసారిగా అమరావతి నుంచి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తన కార్యకర్తలతో కలిసి కాకాణికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణ శివారులోని మద్దూరుపాడు నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ట్రంక్ రోడ్డు మీదుగా భారీగా ఊరేగింపు జరిగింది. అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన కాకాణి.. కార్యకర్తలు, నేతలతో కాసేపు ముచ్చటించారు..