Telugu Updates
Logo
Natyam ad

అగ్నిప్రమాదం.. భక్తుల సజీవదహనం.?

తంజావూరు: తమిళనాడు తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్ ఆలయ రథం ఊరేగింపులో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11మంది భక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. మరో 15 మంది గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతం జరిగిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు..