1-9 తరగతుల పరీక్షలు వాయిదా..?
ఏప్రిల్ 16-22ల మధ్య నిర్వహించాలని నిర్ణయం..!
హైదరాబాద్: పరీక్షలకు కేవలం వారం రోజుల ముందుగా 1-9 తరగతుల సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) కాలపట్టిక జారీ చేయడంపై విమర్శలు రావడంతో విద్యాశాఖ వాటిని వాయిదా వేసింది. ఏప్రిల్ 7 నుంచి పరీక్షలు జరుగుతాయని బుధవారం రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్ సిఈఆర్టీ) కాలపట్టికను విడుదల చేసింది. దీనిపై ‘పరీక్షలకు వారం ముందు కాలపట్టిక అనే శీర్షికన ఓ వార్త లో ప్రచురితం కావడంతో ప్రభుత్వం ఎస్.సి.ఈ.ఆర్టీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాలపట్టికను జారీ చేయడం ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించినట్లు తెలిసింది. వారం రోజుల్లో ప్రశ్నపత్రాలను ముద్రించి ఎలా పాఠశాలలకు చేరుస్తారు? అని అడిగినట్లు సమాచారం. దాంతో ఎస్సీఈఆర్టీ సంచాలకురాలు రాధారెడ్డి పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్ 16 నుంచి 22 వరకు జరపాలని నిర్ణయించినట్లు గురువారం రాత్రి 10 గంటలకు ప్రకటించారు. ఆ ప్రకారం కాలపట్టికను విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు (23వ తేదీ న ఫలితాలు వెల్లడించాలి. పాఠశాలలకు ఆరోజే చివరి పని దినం