ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి 6వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు ముల్కల మల్లారెడ్డి, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. వాజ్ పాయ్ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. తన జీవితం మొత్తం దేశానికి అంకితం చేశారని, వారు లేని లోటు పూడ్చలేనిదని కొనియాడారు. వారి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు నడవాలని, వారి ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అటల్ బిహారీ వాజ్ పెయ్, ఎల్కే అద్వానీల నాయకత్వంలో వేసిన విత్తనాలు మొలకలై భారతదేశమంతా భారతీయ జనతా పార్టీ బలోపేతమైందని మూడుసార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకో గల శక్తి భారతీయ జనతా పార్టీకి వచ్చిందని తెలిపారు. ప్రతిపక్షాలు మెచ్చిన ఏకైక నాయకుడు ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమేనని అన్నారు. భారత పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ తో పాటు భారతరత్న ఇస్తూ ఈ దేశము లో సముచిత స్థానాన్ని దేశ ప్రజలు కల్పించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు గోలి రాము, మాజీ జిల్లా అధ్యక్షులు మున్నారాజ సిసోడియా, బిజెపి సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు, లింగన్నపేట విజయకుమార్, అమిరిశెట్టి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.