Telugu Updates
Logo
Natyam ad

మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధ్యక్షులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బీఆరెస్ ఎమ్మెల్యే గా పని చేసిన నడిపెళ్లి దివాకర్ రావు వైఫల్యాలు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవలు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణభూతమయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దివాకర్ రావు 20యేండ్లు ఏమ్మెల్యే పదవి  అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు. స్వార్ధం తప్ప ప్రజాపలనపై దివాకర్ రావు కు ఎప్పుడు ప్రేమ లేదని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంను విస్మరించడం వల్లనే దివాకర్ రావును ప్రజలు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ప్రజలకు ప్రేమ పాత్రుడైన ప్రేమ్ సాగర్ రావును ఎమ్మెల్యే గా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన వందరోజుల్లోనే నియోజవర్గంకు 200 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకు దక్కిందన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక సమస్యలను పరిష్కరించడానికి ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారన్నారు. ప్రేమ్ సాగర్ రావు సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు.