సకాలంలో స్పందించని విద్యుత్ అధికారులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం
ఏఈఈల ఫోన్లు స్విచాఫ్
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో విద్యుత్ మీటరులో మంటలు చెలరేగాయి.. దీంతో స్ధానికులు వెంటనే సబ్ స్టేషన్ కార్యాలయానికి పోన్ చేశారు.. అయినా ఎవరు కుడా స్పందించలేదు. ఏఈ కీ పోన్ చేసినా కుడా స్విచ్ అప్ వచ్చిందీ. విద్యుత్ శాఖ కార్యాలయానికి ఫోన్ చేసిన కూడా ఫోన్లు లేపకపోవడంతో వారి నుంచి స్పందన కరువైంది. అధికారుల ఫోన్ లు స్విచాఫ్ ఉండగా.. కార్యాలయాల్లోని ఫోన్ లు మోగని పరిస్థితి. దీంతో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. అసలే వేసవికాలం కావడంతో విద్యుత్ ఘాతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అన్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని వినియోగదారులు వాపోతున్నారు. చివరికి అర్థంకాక ఆసిఫాబాద్ సీఐ కు పోన్ చేసి మీటరు కాలిపోయిందనీ చెప్తే. సీఐ వెంటనే స్పందించి లైన్ మెన్ కు, ఫైర్ ఇంజన్ కు సమచారం ఇవ్వడంతో అప్పుడు విద్యుత్ అధికారులు స్పందించారు. సామాన్య ప్రజలకు స్పందించని విద్యుత్ అధికారులు, ఒక పోలీస్ ఆఫీసర్ కి స్పందించారు. ఏదైనా జరగరానిది ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అవుతారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు అందుబాటులో ఉండాలని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు..