Telugu Updates
Logo
Natyam ad

కళలు మా ప్రాణం – సమాజ సేవ మా ద్యేయం

నటరాజ కళా నిలయంలో పండ్లు పంపిణీ

రంగారెడ్డి జిల్లా: అజయ్ నటరాజ కళా నిలయం వ్యవస్థాపక అధ్యక్షుడు,బీ సీ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్ మరియు అజయ్ నటరాజ కళా నిలయం కార్యదర్శి నర్సింగ్ రాథోడ్ లు షాద్ నగర్ పట్టణంలోని హాజి పల్లి రోడ్ లో గల గుడిసెల్లో నివసిస్తున్న వారి పిల్లలకు ఈ రోజు బ్రేడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు.ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు…

శ్రీ శ్రీ అన్నార్తుల ఆకలి తీర్చలేని మన బతుకులు వ్యర్థం అంటాను నేను.త్రేతాయుగంలో రాముడు వారధి కట్టే సమయంలో ఒక ఉడతా తన వంతు సహాయం చేసింది.అలాగే మన సమాజంలో ఉన్నటువంటి పేదలకు ఉడతా భక్తిగా ఉడతా సహాయం చేయడానికీ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.ఉడతా చేసిన సహాయం చిన్నదే కావచ్చు కాని చరిత్రలో మిగిలి పోతుంది అన్నది అక్షర సత్యం.మనం చేసే స‌హయం చిన్నదా ,పెద్దదా అన్నది ప్రశ్న కాదు తోటి వారికి సహాయ పడే మంచి మనస్సు మనకు ఆ భగవంతుడు కల్పించినందుకు
మనం ఆయనకు ఎల్లవేళలా కృతజ్ఞులుగా ఉండాలి. నేటి యువత వారికీ తోచిన సహాయం చేస్తు కడు బీదరికంలో ఉన్న వారికి తమ వంతు సహాయం చేయాలని అన్నారు…