Telugu Updates
Logo
Natyam ad

వైద్యులు లేక నిరుపయోగంగా ఆధునిక పరికరాలు..?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా ఉంది. సిర్పూర్ ఆసుపత్రిలో పిల్లల చికిత్స కోసం అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా సరైన వైద్యులు లేక ఇంక్యుబేటర్, వార్మ హీటర్, ఫోటో థెరపీ పరికరాలు గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండి పాడై పోతున్నాయి. ఈ ఆసుపత్రిలో గైనకాలజిస్టు, పిల్లల వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డిలివరీ అయ్యాక శిశువును పిల్లల వైద్యులు పరీక్ష చేయ వలసి ఉంటుంది. ఇక్కడ వైద్యులు అందుబాటులో లేక ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి కాగజ్నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికు వెళితే అక్కడ అమాయక జానాల నుండి డబ్బులు పిండుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఎక్విప్మెట్లు నిరుపయోగంగా మారి తుప్పుపట్టే పరిస్థితికి వచ్చాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిథులు వెంటనే స్పందించి వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.