Telugu Updates
Logo
Natyam ad

జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి

నాట్య గురువు అన్నం కల్పన శిష్య బృందానికి అవార్డుతో సత్కారం సన్మానం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. విజయమాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో మహా శివరాత్రి పురస్కరించుకొని నేషనల్ లెవెల్ కూచిపూడి నృత్యం ఫెస్టివల్ ను హైదరాబాద్ భాస్కర ఆడిటోరియం బిర్లా సైన్స్ సెంటర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాట్యగురువులు హాజరయ్యారు.. ఈ నాట్యోత్సవంలో మంచిర్యాల జిల్లా నుండి శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, గురువు, నేషనల్ లెవెల్ డా॥ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి శ్రీ అన్నం కల్పన గారి శిష్య బృందం హర్షిత, మనస్వి, నికిత, ఆరాధ్య, సాధిక, అలోఖి, శ్రీనిక, జ్ఞాపిక, సృష్టి, చైత్ర, వినుజ, దీపాలి, తనుజ, అమర్త్య, కూచిపూడి నాట్య ప్రదర్శనలు చెశారు. వారి ప్రతిభను గుర్తించి. “నంది అవార్డు” ను ప్రధానం చెసారు.. అనంతరం గరువు అన్నం కల్పన ను “శివ నంది అవార్డ్” తో ఘనంగా సన్మానించారు..