Telugu Updates
Logo
Natyam ad

జిల్లాలో జలశక్తి అభియాన్ పనులపై సమీక్ష

మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీకేరి

మంచిర్యాల జిల్లా: ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి వినియోగించేందుకు ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జలశక్తి అభియాన్ కార్యక్రమం క్రింద జిల్లాలో జరుగుచున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులను కేంద్ర బృందం సభ్యులు ఈ నెల 21 నుండి 23 వరకు పరిశీలించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు. మంచిర్యాల జిల్లా 4, 016 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగి, 1,761 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో జన్నారం, దండేపల్లి, కాసిపేట, భీమిని, నెన్నెల, జైపూర్, చెన్నూర్ లలో వాటరెడ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెంపొందించేందుకు వివిధ పద్ధతుల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం జలశక్తి అభియాన్ కార్యక్రమ నిర్వహణ, పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డిఫెన్స్ మంత్రిత్వ శాఖ సంచాలకులు ప్రీతమ్ సింగ్, సిజిడబ్ల్యుడి జియో హైడ్రాలజీ శాస్త్రవేత్త సుధీర్ కుమార్, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ, జిల్లా పంచాయతీరాజ్, భూగర్భ జల శాఖ అధికారులు పాల్గొన్నారు.