ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యదర్శి, ఎన్నికల అధికారి గంప శ్రీనివాస్, పరిశీలకులు ఐత రత్నాకర్ లు తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య భవనంలో ఎన్నికలు జరిగినాయి. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా మహాసభ నుండి లక్షెట్టిపేటకు చెందిన కొత్త వెంకటేశ్వర్లు ఒకే ఒక నామినేషన్ వేయడంతో ఆయనను జిల్లా మహాసభ అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లు ఏకగ్రీవంగా ప్రకటించారు. అధికార ధ్రువీకార పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది చేతుల మీదుగా ఈనెల 25వ తేదీన అందజేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు నలమాసు కాంతయ్య, కార్యదర్శి ముక్తా శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ సంఘం అధ్యక్షులు కొత్త రాజేశం, మాజీ అధ్యక్షులు రేణిగుంట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, నాయకులు చిలువేరు వైకుంఠం, వజ్జల రాజమౌళి, గుండా ప్రభాకర్, చెట్ల రమేష్, కేశెట్టి వంశీకృష్ణ , జిల్లా కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.