Telugu Updates
Logo
Natyam ad

జిల్లాకు చెందిన రామగిరి శ్రీపతి కి దళితరత్న అవార్డు ప్రదానం.?

కలెక్టర్ భారతి హోళీకేరి చేతులమీదుగా దళితరత్న అవార్డుని తీసుకుంటున్న రామగిరి శ్రీపతి

మంచిర్యాల జిల్లా: అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రవీంద్ర భారతి లో మహనీయుల జయంతి ఉత్సాలను ఘనంగా నిర్వహించి, మన మంచిర్యాల జిల్లాకు చెందిన అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు రామగిరి శ్రీపతి గారిని ఎంపిక చేసి దళితరత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఇట్టి అవార్డ్ జిల్లా కలెక్టర్ భారతి హోల్లికేరి గారి చేతుల మీదుగా బుధవారం అందజేసి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనికుంట్ల ప్రవీణ్ గారు మరియు దళిత నాయకుల సమక్షంలో శాలువా కప్పి సన్మానం చేసి అవార్డు ప్రధానం చేశారు. గత 15 సం.లుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని నేటికీ కుల నిర్మూలన, వరకట్న నిషేధ, కులాంతర వివాహాల పరిరక్షణ మీద ఉద్యమం చేస్తూ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నందుకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు..

ఈ సందర్భంగా రామగిర శ్రీపతి గారు మాట్లాడుతూ.. నేను చేసిన సామాజిక ఉద్యమాలను గుర్తించి ఈ అవార్డు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి, SC అభివృద్ధి సంక్షేమ అధకారి Dr. యోగిత రాణా మరియు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు రావుల విజయ్ కుమార్, ముఖ్య అతిథులు J.B రాజు గారు మరియు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్కపురపు రాయాలింగు, జుమ్మిడీ కుమార్, దేవరపల్లి మధు బాబు, చాపిడి, బెక్కం రాజారాం, ఎలుకపల్లి పవన్, చిలుక శ్రీనివాస్ లు పాల్గొన్నారు.