Telugu Updates
Logo
Natyam ad

మంచిర్యాల సమగ్రాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే దివాకర్ రావు

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రూ. 18 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి తోళ్ళ వాగు వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద ఆస్ఫాల్ట్ కాంక్రీట్ తో మరమ్మతులు, లయన్స్ క్లబ్ 100 ఫీట్ల రోడ్ దగ్గర టి జంక్షన్ అభివృద్ధి, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి తోళ్ళ వాగు వరకు రోడ్డు వెడల్పు, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో మంచిర్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు..