మంచిర్యాల డిసిపిగా అఖిల్ మహాజన్..!
రామగుండం పోలీస్ కమిషనరేట్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ కు మంచిర్యాల డిసిపిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డిసిపిగా విధులు నిర్వహించిన ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గా పదోన్నతి పొంది ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో గతంలో మంచిర్యాల ఏసీపీగా పనిచేసి పదోన్నతిపై డీసీపీ అడ్మిన్ విధులు నిర్వహిస్తున్న అఖిల్ మహాజన్ కు మంచిర్యాల డిసిపిగా బాధ్యతలు అప్పగించారు…