సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. స్మార్ట్ ఫోన్లలో అప్లికేషన్స్ డౌన్ లోడ్ చేసేటప్పుడు, వివిధ కంపెనీల కస్టమర్ కేర్ నుండి వచ్చే కాల్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసాల్లో డబ్బులు పొగొట్టుకుంటే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930/112/100 కు లేదా www. cybercrime. gov. in పోర్టల్ లో లాగ్ ఇన్ అయి ఫిర్యాదు చేయాలని సూచించారు.