రామగుండం పోలీస్ కమిషనరేట్: దేశంలో సాంకేతిక వినియోగం పెరగడాన్ని ఆసరగా చేసుకుని. సైబర్ నేరగాళ్లు పలు రకాల ఆర్థిక లావాదేవీలపై కన్నేసి నేరాలకు పాల్పడుతున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేరాలు అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు ఎన్ సి ఆర్ పి పోర్టల్ (www. cybercrime. gov. in) లో లేదా టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, 112 లకు సత్వరమే పోలీసులకు ఫిర్యాదు చేస్తే రికవరీకి ఛాన్స్ ఉందని సీపీ వెల్లడించారు..