సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీపీ
రామగుండం పోలీస్ కమిషనరేట్: సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు ప్రజలు గురికావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సైబర్ దొంగలు డబ్బు దోచేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా NCRP portal (www. cybercrime. gov. in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే సైబర్ పోలీసుల వారి సూచనలు తప్పక పాటించాలని సిపి సూచించారు..