గుర్తు తెలియని బాలుడి తల లభ్యం..?
హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని బాలుడి తల కలకలం రేపింది. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ కు చెందిన కార్తీక్ ఆదివారం ఉదయం మన్సూరాబాద్ లొనీ సహారా రోడ్డులో ఓ పాల దుకాణంలో కూర్చుని ఉండగా.. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం గమనించాడు. వెంటనే కుక్కను వెంబడించగా… బాలుడి తలను సహారా ప్రహరీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి కుక్క పారిపోయింది. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడి తలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు..