రామగుండం సిపి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
రామగుండం పోలీస్ కమిషనరేట్: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే సైబర్ పోలీసుల సూచనలు తప్పక పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ ల్లో రుణం తీసుకొని విలువైన ప్రాణం పణంగా పెట్టవద్దన్నారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కి కాల్ చేస్తే మోసపూరిత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేయవచ్చని తెలిపారు.
అలాగే ఎన్సిఆర్పీ పోర్టల్ (NCRP portal) (www. cybercrime. gov. in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని పేర్కొన్నారు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడాలని సిపి సూచించారు.