మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ లో దారుణం జరిగింది. కన్న కొడుకును తండ్రి హతమార్చిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. స్థానిక ఆర్కే గుడిసెలు ఏరియాలో నివసించే కనుకుంట్ల కొమురయ్య తన కొడుకు కుమార్ పై కర్రతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొంతకాలంగా జరుగుతున్న కుటుంబంలో కలహాలతో తండ్రి కొమురయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కొడుకు కుమార్ ను హత్య చేసిన తండ్రి కొమురయ్య పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు..