Telugu Updates
Logo
Natyam ad

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం..?

నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని స్థానిక సోఫీనగర్ లో గల తెలంగాణ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం భోజనం అనంతరం పడుకునేందుకు గదిలోకి వెళ్లింది. కొద్దిసేపటి అనంతరం ఆమె ఏదో తాగిందంటూ ఇతర విద్యార్థులు అక్కడే ఉన్న ప్రిన్సిపల్ గంగాశంకర్ కు సమాచారం అందించారు. గదిలో పరిశీలించగా హ్యాండ్ శానిటైజర్ సీసా లభ్యమైంది. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. జరిగిన ఘటనను విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. తల్లిదండ్రులను వదిలి దూర ప్రాంతంలో చదువుకోవడం ఇష్టంలేకనే ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు..