Telugu Updates
Logo
Natyam ad

దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయాలి..?

మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశాలను అణచివేసే విధానాలను కేంద్రం మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచి సామాన్యుడిపై భారం మోపే దుర్మార్గపు వైఖరి మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీ ఖాన్, నాయకులు ఇప్పకాయల లింగయ్య, మేకల దాసు, అక్బర్ అలీ, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, మిట్టపల్లి పౌల్, లింగం రవి పాల్గొన్నారు.