Telugu Updates
Logo
Natyam ad

సీపీఐ జిల్లా మహాసభలు..?

మంచిర్యాల జిల్లా: జూలై 23, 24 తేదీల్లో జరిగే మంచిర్యాలలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్ లో జరిగే సీపీఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 23న పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నుండి ప్రదర్శన చేపట్టి హైటెక్ సిటీ రాంచెరువు పక్కన బహి మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. మహాసభల్లో గత పోరాటాలను సమీక్షించుకుని, భవిష్యత్ ఆందోళన కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఖలిందర్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, వీరభద్రయ్య, చిప్ప నర్సయ్య, ఇప్పకాయల లింగయ్య, మామిడాల రాజేశం, బాజిసైదా, చంద్రశేఖర్, భీమనాధుని సుదర్శన్, ముస్కె సమ్మయ్య, వజ్ర, రాజేశ్వర్ రావు, లింగం రవి పాల్గొన్నారు..