రామగుండం సిపి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
రామగుండం పోలీస్ కమిషనరేట్: కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ కు, మెసేజ్ బ్లూ కలర్ లింకులు, ఆన్ లైన్ యాప్ లను ఓపెన్ చేసి డబ్బులు పంపించి మోసపోవద్దన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్లు 1930, 112, 100 లేదా NCRP portal (www.cybercrime.gov. in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు..