మంచిర్యాల జిల్లా: మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి ధాన్యపు గింజను కొనాలని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, పాల్గొన్నారు..