కానిస్టేబుల్ కు అభినందించినలు..?
రాజన్న సిరిసిల్ల జిల్లా: హన్మకొండ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం లో శని, ఆదివారం రోజులలో జరిగిన రాష్ట్ర స్థాయి వెటరన్( మాస్టర్ అథ్లెటిక్స్) పోటీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ హై జంప్ విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. అంతే కాకుండా కేరళలోని జరుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ప్రత్యేకంగా గోల్డ్ మెడల్ వేసి అభినందించారు. అదేవిధంగా జాతీయ స్థాయి.పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి జిల్లా కి మంచి పేరు తీసుకరవలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ సి. ఐ అనిల్ కుమార్, కానిస్టేబుల్ లక్ష్మణ్ పాల్గొన్నారు..