Telugu Updates
Logo
Natyam ad

మహిళలకు కమీషన్ ఆశ చూపించి గంజాయి తరలింపు.. ముఠా అరెస్టు.?

హైదరాబాద్: గంజాయి సరఫరాకు అంతరాష్ట్ర ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మహిళలకు కమీషన్ అశ చూపించి ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 సెల్ఫోన్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు ఆయినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

“ఈ కేసులో ప్రధాన నిందితులు శ్రీకాంత్, రాహుల్ కలిసి పలు రాష్ట్రాల్లో ఉన్న గంజాయి డీలర్లతో సంబంధాలు పెట్టుకుని గంజాయి సరఫరా చేస్తున్నారు. నిన్న తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి గ్రామం నుంచి నాలుగు వాహనాల్లో 470 కిలోల గంజాయిని నిందితులు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు ప్రయత్నించారు. నలుగురు నిందితులు వేరే కారులోకి గంజాయిని మారుస్తున్న సమయంలో పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నాం. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఆరుగురిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు” అని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు..