Telugu Updates
Logo
Natyam ad

సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..!

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో వ్యవసాయరంగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. యాసంగి వరి ధాన్యం సేకరణ, ఏర్పాట్ల తీరుపై సమీక్ష చేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్తో పాటు ఉన్నతాధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రధానంగా యాసంగి వరి ధాన్యంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం షరతుల నేపథ్యంలో ముడి బియ్యమే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ధాన్యం సేకరణను ప్రారంభించింది. 40లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యాన్ని తీసుకునేందుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న రాష్ట్రానికి సమాచారం అందించింది..

ఈ నేపథ్యంలో జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్లు తదితరాలపై చర్చించనున్నారు. వానాకాలంలో వ్యవసాయరంగం సన్నద్ధతపై కూడా సమీక్షలో చర్చించనున్నట్లు సమాచారం. దళితబంధు పథకం అమలుపైనా సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది..