Telugu Updates
Logo
Natyam ad

సీఎం కేసీఆర్ ప్రగల్భాలు మాని ఆర్టీసీని గాడినపెట్టాలి: ఈటల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అలాంటి ఆర్టీసీ సిబ్బంది ఇవాళ పని ఒత్తిడి భరించలేక చనిపోతున్నారని పేర్కొన్నారు. 2014 నాటికి 11 వేల బస్సులు ఉంటే ఇప్పుడు 9 వేలకు తగ్గించారని, సిబ్బంది సంఖ్య 56 వేల నుంచి 45 వేలకు పడిపోయిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల కళ్లల్లో మట్టికొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

“రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఆర్టీసీ డిపోలు ఎత్తివేయాలని చూస్తున్నారు. ఆర్టీసీని చాప కింద నీరులా కనుమరుగు చేయాలని, లేదా పూర్తిగా ఎత్తేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆర్టీసీలో లాభనష్టాలు చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సమ్మెలు, సంఘాలు లేకున్నా ఆర్టీసీ ఎందుకు నష్టాల్లోకి వెళ్లింది. మూడేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు 6 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కార్మికుల పీఎఫ్ సొమ్ము కూడా వాడుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగల్భాలు మాని ఆర్టీసీని గాడినపెట్టాలి” అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.